పుట:Bala Neethi.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
110

బా ల నీ తి.

లమగు మామూపురలో నేనొకడనుంటిని. మీరు వచించిన పగిదిగోరిన మాద్రీపుత్త్రులలో నొకరుగూడ గన్పడరుకదా. అటులజేయుట వివేకిలక్షణమా?" యని చెప్పెను. అంత నాయక్షు డీతనివివేకమునకు మెచ్చి యతడుకోరకపోయినను నతనినలుగురు తమ్ములను బునర్జీవితులను చేసెను.

    కంటిరా! ఆధర్మరాజాయక్షుని బలవంతులగు  భీమార్జునులలో నొకరినిగోరక  సామాన్యుడగు నకులుని గోరినదేల? వివేకిలక్షణము కాబట్టియేకదా. ఆవివేకమునకే కదా మెచ్చి యాయక్షు డాధర్మరాజు కోరకపోయినను నతని నలుగురు తమ్ములను బ్రతికించినది. కాబట్టి యెవరైనను గష్టమువచ్చినను సుఖమువచ్చినను వివేకమును విడువకుండిరేని వారికి సకలసౌఖ్య్హములు చేకూరును. కాన మనము వివేకమునువిడువక కార్యాకార్యములను వివేకించు కొనుచు సుఖముగా నుండుదము.

ఆ.వె. విను వివేకమనెడి ♦ వింతగొడ్దలిచేత
       నల యవిద్య యనెడు ♦ నడవినఱికి
       తెలివియనెడుగొప్ప ♦ దీపంబుజేబట్టి
       ము కి జూడవచ్చు ♦ మొనసివేమ.