పుట:Bala Neethi.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

107

బా ల నీ తి.

     ఈవివేకము, స్వకీయములగు తప్పులను నగుపఱచి వానిని దిద్దుకొనునటుల జేయుచుండును. మఱియుబరకీయుల తప్పులగూడ సవరణజేయ బాటుపడుచుండును. ఇదియె యసాధ్యమగు నాపదనుండి రక్షించును. ఇదియెన్యాయాన్యాయ విచారణ జేయుచుండును. యిదియే యింద్రియ నిగ్రహత్వము సంపాదింపజేయును. ఈవివేకమె నీచ మార్గగతముల గుమనములను ద్రిప్పి వానిని సన్మార్గ యుతములుగా జేయును. ఇదియెసుఖదు:ఖసమదర్శి ఇదియె సచ్చిదానందమసర్గదర్శి. కాన మానవులకిది యాచరణీయంబు.
     ఈవివేకంబుకలిగినవారలను వివేకులనియనియె దరు. వీరు ప్రారంబించినపని యంతరాయములులేక చక్కగా నెఱవేఱును. వీరుపట్టినదియ బంగారమగు చుండును. అప్పట్టున వీరు గర్వించరు. మఱియు వినయముగా నుండుదురు. కాబట్టి వీరు జగజ్జన వంధ్యులు.
    అనర్ఘంబగు నీవివేకము లేనివారలు విద్వదాదరణీయులు కానేరరు. ఎందువలననన? ఈ వివేకరహితులు దురాశాకులొంగుచుందురు. గర్వము ఖస్తుతులకు బాల్పడుచుందురు. తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళని వితండవాదము జేయు చుందురు. కయ్యమునకు గాలుద్రువ్వుచుందురు. యుక్తాయుక్త విచారణశూన్యులగుచుందురు. ఇవి యవియననేల?  ఈవివేకశూన్యులు దుర్గునముల కెల్ల దల్లియిల్లువలె నుందురు. కాన వీరు జగన్నింద్యులు.