పుట:Bala Neethi.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
104

బా ల నీ తి.

శమమగునుగదా. ఈసద్విమర్శకులు ఇష్పక్షపాతముగా నొప్పిన విషయము మాలిన్యరహితమై పదునాఱవవన్నె మేలిమిబంగారువలె బాగుగానుండును ఈసద్విమర్శకులకు విమర్శనగ్రంధములను వ్రాయుటకు బ్రోత్సాహము జేయుచుండవలెను. మనము వారు చెప్పినమాడ్కి నడువవలయును. దాన మనమనేకలాభముల బొందగలము.

    అటుల లాభముబొందినవారలలో నొకనినిజూపించుచున్నాను.
   మున్ను శ్రీకృష్ణమూర్తి ద్వారకానగరంబున దనపేరోలగంబున సుఖంబుగా గూర్చుండి యుండెను. అత్తఱి ధర్మరాజుపంపున నొకడువచ్చి”అయ్యా! ధర్మరాజుగారు రాజసూయాధ్వరంబుగజేయదలచిరి. కాన వారికి బ్రధానులగుమీరు తప్పకరం”డనిచెప్పి చనెను. అంత నారదమహర్షి వచ్చి “శిష్టరక్షకా! ప్రస్తుతమందు మిక్కిలి యెక్కువగా శిశుపాలుడు జనులను భాదించుచున్నాడు. కాన వానినిదునిమి శిష్టరక్షకు డనుబిరుదమును సార్ధకముజేసికొను“మని చెప్పి కృష్ణునివీడ్కొనెను. అంతట నాశ్రీకృష్ణుడు రెంటిని విని యేమియు జేయజాలక తనయన్నయగు బలరాముని,బినతండ్రియగునుద్ధవుని,  బిలిపించి “గురువులారా! నాకు బరమమిత్రుడగుధర్మరాజు, రాజసూయాధ్వరం బొనర్పదలంచి నన్నుబిలిపించినాడు. ఇక శిశుపాలుడు లోకమును నెక్కువగా గందరగోళము జేయుచున్నాడు