పుట:Bala Neethi.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

103

బా ల నీ తి.

ఈవిమర్శకు లేవిషయమును గైకొని విమర్శింప దలచిరో యావిషయమందు వారికంటె నెక్కువ తెలివైన వాడై యుండవలెను. ఇది చేదు, ఇది తీపు, ఇది పులుసు. లోనగురుచులను దెలియబఱచు నాలుకవలె నె యీకార్యము మంచిది, యీకర్యము చెడ్డది. యని యీవిమర్శకులు తెలియబఱచుచుందురు.

    లోకమునగించిద్జ్జ్లలువాచాటునిబండితునిగా దలచుచుందురు. అట్టిపట్టున నీవిమర్శకు లాప్రగల్బుని పత్తుం దెలిసికొని యాకించిద్జ్జ్ఞలకు దెలియ బఱచుచుం దురు. ఎవరైన నొకరు వచ్చి తమబోధలవలనమఱి యొకనిని మోసముజేయ దలచిన యెడల నాసంగతి నీ విమర్శకులు గ్రహించి యాతనినావల దఱిమివేయు దురు. ఇట్టి సద్విమర్శ కులు పూజ్యులు.
   ఇక దుర్విమర్శకులు కొందఱు కలరు. వారు దుర్విమర్శకులై వారి కారణములవలననే స్దిరీకరించ వచ్చును. వారు మంచివానినిగూడ గుతంత్రములచే నేవియోకొన్ని యల్పకారణములను గైకొఇ తప్పులని చెప్పెదరు. మఱియు వీరహకారపూరిత చేతస్కులై యుందురు. కాన నీదుర్విమర్శకులు దూషణీయులు.
    సద్విమర్శకులు వచించినపగిది మనము మనతప్పులను దిద్దుకొనవలయును. విమర్శించిన కొలది మంచిమంచి సంగతులు బయలువెడలును. సానబెట్టినకొలది వజ్రము ప్రకా