పుట:Bala Neethi.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
102

బా ల నీ తి.

వి మ ర్శ న ము.

చక్కగా విచారించుట విమర్శన మనబడు.

    ఇది, చెడుగుపనులను జేయించనీయదు. ఇదియె, లాభాలాభములగుఱించి దూరాలోచనమును జేయించును. ఇదియ గుణాగుణముల దెలియ బరచు చుండును. ఇదియె, పాండితిని వృద్దిజేయుచుండును. ఇదియే తత్తఱపాటు నాపును. ఇదియె, నిదానము గలిగించుచుండును.
   కాబట్టి వివిధఫలప్రదంబగు నీవిమర్శనము మనుజ జాతికంతకు ముఖ్యము. ఇట్టివిమర్శనముకలిగిన వారల విమర్శకులని చెప్పెదరు. వీరు తాము చక్కగా నడచుచు నితరులనుగూడ మంచిద్రొవల నడపించు చుందురు. వీరొకదాని విషయమై చర్చింపదలసినపుడు దానికి దానికిసంబంధించినమఱికొన్ని విషయముల బరిశీలించి బలాబలములగాంచినకారణముగా నిక్కమగు సంగతిని సిద్ధాంతీకరించుచుందురు. మఱి  కొన్నిసంగతులయందు వీరెక్కువగా బరిశ్రమజేసి హేతుసహితముగా గ్రొత్తసంగతులను లోకమునకు దెలియబఱచుచుందురు. దాన లోభోపకారముకల్గును గదా. కాబట్టి యీవిమర్శకులు నితరులకు విశేషశ్లాఘాపాత్రులు. కవియైనను బండితుడైనను గాయకుడైనను శిల్పియైనను గావచ్చునుగాని విమర్శకుడగుటమాత్రము కష్టము. కారణమేమన?