పుట:Bala Neethi.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
88

బా ల నీ తి.

ఆ శ.

ఆశయనగా నొకదానినిగోరుటయే.

     ఈ యాశయనునది ప్రతిమనుజునికి స్వాబావిక ముగా నున్నది. బాలురకు విద్యయందు గోరిక యుండును.యౌవనవంతులకు భోగాదివిషయము లందాసక్తి యుండును. వృద్ధులకు దమపుత్త్రులయభి వృద్దియందాశ యుండును. కవులకు గావ్యరచన యందును, రాజులకు బరరాజ్యస్వీకరణమం దాస యుండును. విరాగులకు భగవంతునిమీద నపేక్ష యుండును. వేయేల? ప్రతివారికి నేదోయొకదానిపై నాశయుండియే తీరు. దీనిని బోగొట్టుట కెవరును జాలరు. ఇటుల గోరికయుండుటమచిదనియే నా యభిప్రాయము. ఎందులకన? మనమొక ఫలమును గోరనిదే యేపనిని జేయజాలము. ఈయాశయే మన యభివృద్దిసూచకము. ఈయాశవలననే కష్టముల నుండి విడుదల జెందుచున్నాము. కాబట్టి ప్రతివాడాశ కలిగి యుండుట మచిదేకాని తనతలకుదగనియాశనె యత్యాశయని యనెదరు. ఇది మంచిదికాదు. ఎవడైనను, దనసామర్ద్యమును గుఱ్తెఱుగక గొప్పకోరికలగోరగూడదు. ఒకవేళ నటుల గోరినను నవి వ్యర్దములు కాగలవు. వీనినే గొంతమ్మ కోరికలనెదరు. ఇట్టి వ్యర్దమగునాశనే దురాశయని వచించెదరు. దీనిని నేను ముమ్మా