పుట:Baarishhtaru paarvatiisham.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

సుమా రేడుగంట లైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళూ అటు వెళ్ళేవాళ్లూ; స్టీమరుమీదనుంచి దిగినవాళ్ళకోసం వచ్చిన వాళ్ళూ, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చినవాళ్ళూ, కూలివాళ్ళూ; ఒకళ్లేమిటి, సముద్రము ఒడ్డంతా కిటకిట లాడుతున్నది. హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గిరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపము పెట్టెకూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు, వాళ్ళ ధర్మాన్ని.

ఒక కూలివాడిని కేకవేసి సామాను వాడినెత్తిమీద పెట్టి బండ్లదగ్గిరికి వస్తున్నాను. వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్నుపిలిచేవా రెవరుంటారని ముందుకి నడిచాను. మళ్ళీ కేక విన బడేసరికి ఆగి వెనక్కిచూశాను. రాత్రిస్టీమరులో బంట్రోతు ఆదిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరుగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయము కనబడలేదు. మొదటనే రైలులోనుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది; ఇంతబాధ లేకపోయేది. పోనీవృధాగా పారేయడ మెందుకు, రైలులో విడిచిపెడితే ఎవళ్ళయినా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ