పుట:Baarishhtaru paarvatiisham.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్ల నేమో ననుకున్నాను. కాస్త దిగతుడిచిపోసే వాళ్ళయినా లేరుకదాఅనివిచారించాను. ఈతలనొప్పీ అదీ చూస్తే పీడజ్వరము ఏమైనా వస్తుందేమోననుకున్నాను. ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి. ఇంక నా ఒళ్ళు నాకు తెలియదు.

కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెళకువ వచ్చింది. కండ్లు తెరచిచూచేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము. లేవండి, దిగా లన్నాడు. లేచాను. తలనొప్పితగ్గింది. తేలికగాఉంది. జ్వరము గిరము ఏమీరాలేదు. చులాగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రోతు అడిగాడు. దివ్యంగా వుందన్నాను. లేచి తలగుడ్డ సవిరించుకుని, నా సామా నెక్కడ ఉంది అన్నాను. 'కిందికి వెళ్ళిపోయంది మీకంటే ముందేను. మీరుకూడా దయచేయం' డన్నాడు. రాత్రి చూసుకోలేదు. సామానులు జాగ్రత్తగా వుందో లేదో? పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దించివేశాడని భయము వేసింది. లేచి నుంచుని చూసేటప్పటికి నేను చెన్నపట్నములో కొన్న దొరసాని టోపీ ఒక బల్లమీద పెట్టివుంది. రాత్రి బంట్రోతు తీసుకువచ్చి పెట్టిఉంటా డనుకొన్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను.