పుట:Baarishhtaru paarvatiisham.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతకూ అసలుసంగ తేమిటంటే ఈ చిన్న స్టీమరులోనుంచి పెద్దస్టీమ రెక్కడ మెలాగా అని సందేహము కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకము వచ్చింది. చిన్న స్టీమరులోనుంచి పెద్దస్టీమరెక్కే ఉపాయము చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను వినడము సంభవించింది. పెద్దస్టీమరు మీదనుంచి చిన్నదాని దగ్గరికొక తాడు నిచ్చెన దింపుతారట. చిన్నస్టీమరెప్పుడూ కెరటాలవల్ల పైకొకమాటు లేవడామూ, ఒక మాటు దిగడమూ ఉంటుంది గనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణీకులు సమయము కనిపెట్టి కెరటమువల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేతకాని వాళ్ళను నడుముకొక తాడుకట్టి పెద్ద స్టీమరు మీద నుంచి కొక్కెమున్న గొలుసొకటి దింపి, ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషినడ్డిని ఉన్న తాడు తెగిపోయినా, ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమరులోనే బహుశా పడవచ్చుననీ, ఒకవేళ సముద్రములో తప్ప మరి యెక్కడా పడడనీ, ఒకవేళ సముద్రములో పడ్డా, కాని, ప్రాణభయ మేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటా రని చెప్పుకోగా విన్నాను ఆఖరుమాటలవల్ల, విన్నప్పుడు కొంచెము దైర్యము కలిగినా, తీరా తరుణము వచ్చినప్పుడాలోచిస్తే అంత దైర్యంగాలేదు, ఏమంటే ఒకవేళ స్టీమరులో పడితే తలకాయ బద్దలు కావచ్చును. లేదా మరొక విధమైన దెబ్బ లేమయినా తగలవచ్చును. అలా కాక సముద్రములో పడితే పైవాళ్ళు వలవెతికి తీసుకువచ్చే లోపల కెరటాలు మనను అవతలికి కొట్టి వెయ్యవచ్చు. పడిన చోటనే ఉంటామని