పుట:Baarishhtaru paarvatiisham.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానితో ఆయనకు కొంచెము కష్టము తోచింది కాబోలు, ఒక్కక్షణ మూరుకున్నాడు. కాని పాపము ఎంత సే పూరుకోగలడు? ఆడేనోరు, తిరిగేకాలు, ఒక్కమాటూ ఊరుకోలేవంటారు పెద్దలు. ఆమాట నిజమే. ఆయ నొక నిమిష మూరుకుని 'అబ్బాయీ, పాపము చాలా నిద్దర వస్తున్నట్లున్నది. పడుకో నాయనా ' అన్నాడు. 'ఏమిటి మీ అభిప్రాయము? నే నేమన్నా చంటిపిల్ల వాడి ననుకున్నారా? అని అడుగుదా మనుకొని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానము చెప్పకుండా నా బొంత తీసి పక్కవేసుకున్నాను. అది చూచి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడము మొదలుపెట్టాడు. ఎవళ్లు నవ్వుతే లెక్కేమిటి మనకు? నవ్వినవాళ్ళమూతే వంకర పోతుందనుకొని, పోనీ మనకు మడత మంచముకూడా ఉందని చూపించడానికి అదికూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమో నని ఆ ప్రయత్నం మానేసి నా పక్కమీద కూచున్నాను. 'నాయనా, ఈ బొంత నీతోకూడా అడంగుకు తీసుకువెళ్ళుతావా?' అన్నాడు. 'ఆ తీసుకు వెళ్ళుతాను. తీసుకు వెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవెయ్యడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమ రంత ఆశ్చర్యపోవడానికి కేమీ కనుపించదు ' అన్నాను. ఆయన నాకేసి సూటిగా చూచి 'ఎక్కడయినా పొరపాటున మరిచిపోతావేమో సుమా! ఎక్కడా మరిచిపోకు. ఆ దేశములో ఏ జమీందారైనా ఇది చూడడము తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణము పోయినా, ఎవళ్ళకీ యివ్వకు. ఇటువంటివి వాళ్ళ కుండవు. అందుచేత చాలామంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదముగా కాపాడుకో. పోగొట్టుకోకు. నీ కిష్టమయితే మళ్ళీ యింటికి వచ్చే