పుట:Baarishhtaru paarvatiisham.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళబోతున్నాడు. 'అట్టే మందేమిటి, అసలే ఎవ్వళ్ళూ ఇందులో ఎక్కగూడదు. అడ్డమయిన వాళ్ళూ ఎక్కడము మొదలుపెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటీ కలిసి తిరగడము నాకిష్టములేదు. ఈ రోజుల్లో ఎంతసేపూ దూరంగా వుంటే గౌరవము కాని, అంతటివారు కూడా మనతో తిరుగుతున్నారు అగౌరవము మనకే నన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాదా, అదీ, లేదు గనుకనే మావాళ్ళు అంత నీచస్థితిలో ఉండటము. ఆ గౌరవమూ అదీ మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి. నా మర్యాదా గౌరవమూ అదీ ఆలోచించి యింత యిదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టరు చూడండి. నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివితక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానము చెప్పి పరాభవిద్దాముకున్నాను. కాని ఎందు కనవసరంగా నని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చిందుతుందని మా మామ్మ చెప్పిన సామెత జ్ఞాపకము వచ్చింది. ముసలివాళ్ళు విద్యావిహీనులని మనము తోసివేస్తాము కాని వాళ్ళకున్నంత ప్రపంచ జ్ఞానము మరొకళ్ళకు లేదు. వాళ్ళ పాండిత్య మంతా, పాటల్లోనూ, సామెతల్లోనూ ఇమిడి వుంది.' అని ఇంకా ఏమన్నా మాట్లాడా లనుకుంటే 'మళ్ళీ దర్శనము చేస్తానండి ' అని ఆయన వెళ్ళబోతున్నాడు ధనమూల మిదం జగత్తని మాతాత చెపుతుండేవాడు. డబ్బుదగ్గిర ఏ పని బడితే ఆ పని చెయ్యగల సామర్థ్యముందని చాలామందివల్ల విన్నాను. చిన్నక్లాసు మాష్టర్లకి లక్ష్మిప్రసన్నము చేస్తే పైక్లాసులోకి సుళువుగా ప్రమోషన్ కావచ్చు నన్న సంగతి నా అనుభవంలోదే. పోలీసు