పుట:Baarishhtaru paarvatiisham.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వచ్చాను. నా వెనకాలే వచ్చి 'అంజేకాలణా' అని, ఒక ఊరంతా వినపడేటట్టు పెద్ద పొలికేక వేశాడు. నే నులిక్కిపడి వెనక్కి తిరిగి 'ఏమిటి, గాడిద గుడ్డులాగా ఝడిపిస్తావు' అన్నాను. వాడికర్ధము గాక మాట్లాడకుండా చక్కాపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో యిద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపివేశాడు.

నేను గుర్రపుబండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణ్ణి రైలుసంగతి అడిగాను. ఎక్కడికంటే, 'ఇలా యింగ్లండు వెడుతున్నాను. కొలంబో దాకా వెళ్ళే రైలెప్పుడుం' దన్నాను. సాయంత్రమారు గంటలకని చెప్పి ఫలాని స్టేషన్ కు వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూచి అదేమిటి అన్నాడు. టోపి అన్నాను: చూపించమంటే చూపించాను. చూసి అక్కడినుంచి ఒకటే నవ్వు. వీడికేం మతీ గితీ పోయిందా అనుకుని ఎందుకల్ల నవ్వుతావు, అన్నాను. 'ఏమయ్య, పైతకారివలె ఉన్నావు. ఇది ఆండవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా' అన్నాడు. అనేటప్పటికి నిర్ఘాంతపోయి ఒకమాటు టోపీకేసి, ఒకమాటు ఆయనకేసి చూచి, అక్కడ షాపులో వాళ్ళిందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే ఏమైనా కానీ, ఈ అరవవాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది. 'అయితే ఏ మంటా ' నన్నాను. 'నీ కెందుకయ్యా ఈ ఆండవాళ్ళ టోపీ ' అన్నాడు. 'ఓయి వెర్రినాయనా, కొలంబోలో నే ఎరిగున్నవాళ్ళున్నారు. వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకు వెడుతున్నా' నని చెప్పాను. కాని నా మాటలు అతనుమట్టుకు నమ్మినట్టు కనబడలేదు.

టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకుని రైలుకి