Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతా అనాచారమే, అన్నము చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోడము, ఆచేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము. చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయము. అంత అనాచారముగా ఉంటారు, వీళ్ళ కసహ్యము ఎలా లేదా అనుకున్నాను.

భోజనము చేసి నాగదిలోకి వచ్చి కాస్సేపు విశ్రమించి చొక్కాలు తొడుక్కుని ఊళ్లోకి బయలుదేరాను. నాకు జుట్టు ముడి, గిరజాలూ ఉండేవి. అవి తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని తరవాత రైలు సంగతి కనుక్కుని వద్దామని ఉద్దేశం.

వీధిలోకి రాగానే నడిరోడ్డుమీద ఇంజన్ లేకుండా రైళ్ళు పరుగెడు తున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషనులూ అవి అక్కరలేదుట. ఎక్కడపడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందను కున్నాను.

అక్కడొక పెద్ద మనిషిని పిలిచి 'మంచి షాపు లెక్కడుంటా ' యన్నాను. మౌంటురోడ్డులో వుంటా యన్నాడు. 'అయితే అక్కడికి వెళ్ళడ మెలాగ ' అన్నాను. 'ఇక్కడ ట్రాము యెక్కితే నేరుగా పూడ్చు' నన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రాముకారొకటి వచ్చింది. దానిమీద రాయపురమని వ్రాసివుంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అనే ఆదుర్దాకొద్దీ నాతో మాట్లాడుతున్నాయన మాట పూర్తిగా వినిపించు కోకుండానే, 'ఆపండి, ఆపండి ' అని కేకలువేస్తూ పరుగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే నా కేక వినపడి ఆపారుగదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెము