పుట:Baarishhtaru paarvatiisham.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'మేము బ్రాహ్మణులమేను. ఇక తక్కిన సంగతంతా మీ కెందుకూ? గదివుంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెవ్పండి.'

'నిండా గట్టివాడుగా వున్నావే? ఎన్ని దినము లుండేదీ చెప్పక పోతే ఎష్టదా గది యిస్తును? మూడు దినాలు కంటే వుండేదానికి లేదు.'

'నేను మూడు రోజులుకూడా ఉండను. మళ్లీ ఈ రోజు సాయంత్రమో రేపో వెళ్ళి పోతాను.'

'అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు' నని ఒక గది చూపించాడు.

నే నాగదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరచుకొని బయటికివచ్చి స్నానముచేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని చెంబు తీసుకుని భోజనాల సావిటిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి, కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళుకూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనము చెయ్యబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరము లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గిరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనము చేస్తున్నవాళ్లూ వడ్డించేవాళ్లూ కూడా నన్ను చూసి లోపల నవ్వుకోడము మొదలు పెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యధావిదిగా పరిషించి భోజనానికి కూర్చున్నాను.

ఇంకా వడ్డన అవుతుండగానే నాపంక్తిని కూర్చున్న అరవ వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటినే తినివెయ్యడము మొదలు పెట్టారు. వడ్డన అయ్యే అవడముతోటే గబగబా నెయ్యి,