పుట:Baarishhtaru paarvatiisham.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లకు అర్ధ మయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి యివ్వాలన్నాను.

'మూణు రూపాయి'

'ఇక్కడి కెంతదూరము ఉంటుంది?'

'రెండుమైలు సుమారు ఉండును.'

'అయితే రెండుమైళ్లకి మూడు రూపాయ లెవరిస్తారు? నేనివ్వను'

'మీదయ సామీ, మా మామూలు మేము చెప్పాము, నీ వేమి ఇస్తావో చెప్పూ.'

'ఒక్కరూపాయి ఇస్తా.'

'ఏమి సామీ, అట్లా చెపుతారు. ఇది నాటుపుర మనుకొంటివా మాటువండి అనుకొంటివా, పారు సామీ, అది కుధరె వండి. గుర్రము సూస్తివా, నిండా బాగా పోను '

ఇంకా మనకు బోలెడు పనిఉంది పోనీ, త్వరగా పోదామని ఇంకో అర్ధరూపాయి ఎక్కువిస్తానన్నాను.

'ఏమి సామీ, ఒక్క పెట్టి రైలులోనుంచి ఇక్కడ పెట్టినందుకే అర్ధరూపాయి యిస్తివే! రెండు మైలుదా పోవాలె, నేనూ గుర్రమూ బతకాలె ఎట్లా సామీ! ఊఁ మీతో బేరమెందుకు సామీ, మీకు తెలియదా రెండు రూపాయి ఇచ్చెయ్యండి, ఎక్కండి.'

నేను ఇవ్వనందా మనుకొంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్క మన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి, మాట్లాడ కుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా రూపాయిన్నరకే బండ్లు కడతా