పుట:Baarishhtaru paarvatiisham.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

రైలు ఆగీ ఆగడముతో వందమంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చిపడ్డారు. పెట్టె నెత్తిన బెట్టుకొని నేనూ దిగాను. నా చుట్టూ ఇరవై మంది కూలీలు చేరి, నేను తీసుకు వస్తా నంటే నేను తీసుకు వస్తానని నా నెత్తిమీదివి లాక్కుని వాళ్లల్లో వాళ్లు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరుగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమో నని గబగబ పరుగెత్తి వాడి నందుకున్నాను. ఆగ మంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గిరికి తీసుకు వెళ్ళి దింపాడు.

ఒక పాతిక మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ' ఎక్కడ పోవాలె సామీ ? రండిమీ, నేనుదా జల్దీగా కొంచు పోతా ' నంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళు, సామాను లాక్కు పొయ్యే వాళ్లూను. ఎక్కడికి వెళ్లడానికీ తోచదు. నే నెవళ్లనీ ఎరుగను. పోనీ ఏ హోటలుకైనా వెడదామా అంటే హోటలు పేరుగాని, వీథి పేరు గాని తెలియదు. ముందు వీళ్ల గోల వదలితే నయ మని నేనెక్కడికీ వెళ్లను, నాకు బండి అక్కరలే దని నా పెట్టెమీద కూర్చున్నాను. అయినా కానీ నా కేలాగూ బండి కావా లని వా ళ్లూహించిన ట్లున్నారు, వాళ్లుమట్టుకు నన్ను విడిచి పోలేదు. 'ఎందుకు సామీ, అంత కోపము చేస్తావు. మీ యిష్టము