పుట:Baarishhtaru paarvatiisham.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరు లాగా రన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామానుకేసి చూపించి 'ఈ సామానెవరిది ' అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడులుతూ, 'నాదేను ' అన్నాను.

'ఎందు కలా గొలుసుకు కట్టావు?'

'సామాను రైలు కుదుపునకు కింద పడిపోకుండాను, జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా.'

పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడ మారంభించారు. గార్డు యాభైరూపాయిలు జరిమానా ఇవ్వమన్నాడు. 'నాదగ్గి రేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించ ' మని ప్రాధేయ పడ్డాను. ఆఖరుకు ఎలాగైతే నేమి నా సామాను గొలుసుని విప్పివేయ మని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తరువాత నా అపరాధమేమిటని పక్కన ఉన్నవాళ్లనడిగి తెలుసు కున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. యింక కాస్సేపటికి రైలు మళ్ళీ ఆగింది. నాపెట్టెలో కొందరు దిగారు. మరికొందరెక్కారు. కాస్సేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నాపక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు నలభై సంవత్సరముల మనిషి నావైపు వీపుపెట్టి, కాళ్ళు బల్ల మీదికి చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది. మనదేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ, ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ, ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ- అయినా మంచికాలము సమీపిస్తున్నది. నేను మూడు నాలుగు సంవత్సరములలో స్వదేశానికి తిరిగివచ్చి ఈ కష్టాలను తొలగిస్తా ననుకొంటూ నేనూ నిద్ర పోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంత సేపటికి మెళు