పుట:Baarishhtaru paarvatiisham.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

జాబితా వ్రాసుకొన్నాను. దంత ధావనానికి పది కచ్చికలు నలిపిన పొడుమూ, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలూ, చిన్న ఇత్తడి చెంబూ, దంత ధావనమైన తరువాత స్నానముకదా అనుకొన్నాను. అందు కవసరమైనవి ఒళ్ళు తుడుచుకోటానికి రెండు అంగవస్త్రాలు; స్నానానంతరము తలకు రాసుకోడానికి సీసాలో పోసి కొంచెము కొబ్బరి నూనె; తల దువ్వుకోడానికి దేశవాళి దువ్వెన్న, బొట్టు పెట్టుకోడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు; ముఖము చూచుకోడానికి పావలాపెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయముకదా! అందుకు నాకవసరమని తోచినవి నాలుగు ట్విల్ షర్ ట్లూ; రెండు టైలూ; రెండు మేజోళ్ళ జతలూ (నూలువి); మూడున్నర పెట్టి బూడ్సుజోడూ; అక్కడ సూట్సు అవసరము గనుకనూ, చలిదేశము గనుకనూ, పదిహేను రూపాయలు ఖర్చుపెట్టినా గుడ్డ కొంచెము బాగుండడముచేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకొనడమువల్ల నాకు చాలీ చాలకుండా తయారైన ప్లానలు సూట్లు రెండు. ఇంగ్లండు వెళ్ళితే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంతవరకూ స్వదేశ పద్ధతి అవలంబింతామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాను సిల్కు. ఇంక ధరించవలసిన దుస్తులయిన తరువాత ఆలోచించవలసినది భోజనముకదా అనుకొన్నాను. అందు కవసరమైనది ముందు మంచి నీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళచేతి మాలకూడు తినకుండా మనమే స్వయంపాకము చేసుకుంటే బాగుంటుందికదా అనుకొన్నాను. అక్కడగూడ అన్నము ఎలా