పుట:Baarishhtaru paarvatiisham.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లేకపోవడం-ఇలాటివన్నీ మూర్తీభవించిన మూర్తి మా పార్వతీశం అని నా అభిప్రాయం. మీరేమంటారు?

ఇలా నిర్మొగమాటంగా మాట్లాడానని ఏమీ అనుకోరనుకుంటాను. ఏమంటే సత్యవ్రతం హాస్య రచయితకు ప్రధాన లక్ష్యం.

ఇప్పటివలెనే ఎప్పటికినీ ఆంధ్రుల అల్లారు ముద్దు బిడ్డగా పార్వతీశం చిరంజీవిగా వర్ధిల్లాలని మీరు ఆశీర్వదించండి.

మొక్కపాటి నరసింహశాస్త్రి.

Baarishhtaru paarvatiisham.pdf