పుట:Baarishhtaru paarvatiisham.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తట్టుకొని సంతోషిస్తాడు. మా పార్వతీశం విషయంలో అంతే జరిగింది. మనలో ఉండే తెలివితక్కువ లన్నీ పార్వతీశంలో చూచి ఆ వెర్రికుంకగనక అలా చేశాడు కాని నేనైతేనా అని ఎవరిమట్టుకువారు ఆత్మ సంతృప్తితో పార్వతీశాన్ని చూచి నవ్వుతున్నారు. దీనినే ఇంగ్లీషులో ఒక తత్వవేత్త 'సుపీరియర్ ఎడాప్టేషన్ ' అన్నాడు. అనగా అది ఒక రకమైన అహంకార వికార మన్నమాట. కారణం ఏమైనా పార్వతీశం ఆంధ్ర హృదయంలో స్థిరనివాసము ఏర్పరుచుకున్నాడు. అతనిలో అలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు లేకపోవచ్చు. అందుచేత మహా నాయకుడు కాడు, పోనీ నాటకాల్లో ప్రసిద్ధుడైన ప్రతి నాయకుడూ కాడు. ఏది కాకపోయినా అతను మనలాటి మానవుడు. మనలో మావవత్వమే అతనిలోనూ ఉంది. మన మంచీ, మన చెడూ అతని లోనూ ఉంది. ఇన్నెందుకు మనమే అతను, అతనే మనం. అందుకనే మన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కడు కాగలిగాడు పార్వతీశం.

ఎవరు ఎంత నవ్వినా, పార్వతీశం ఏమీ అనుకోడు. మనవాళ్ళకు సామాన్య ధర్మాలైన సాహసం, ఉద్రేకం, దూరాలోచన, అజ్ఞానం, అహంకారం కార్యావసరమైన సాధన సంపత్తి చేకూర్చుకొనే ఓపిక