పుట:Baarishhtaru paarvatiisham.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుగా బోల్తాపడ్డ సంగతి చెప్పి నాసంగతి నీకెలా తెలిసిందని అడిగాడు.

మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు. అందుచేత అజ్ఞానజనిత అపచారాలు చాలా ఉంటాయి. ఇటువంటివి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించడం కొంతవరకు అతిశయోక్తి అయినా, తప్పక హాస్య జనకంగా ఉంటుందని తేలింది. ఈ అజ్ఞాన కృతాపరాధములకు తోడు, తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్లు నటించడం మనలో చాలా మందికి అలవాటు-పార్వతీశం ఆడటోపీ తెలియక కొని వాళ్లు నవ్వగానే తన స్నేహితురాలికోసం కొన్నానని డబాయించినట్లు. మనలో చాలా మంది కీ జబ్బు ఉన్నది. ఇది కూడా అజ్ఞాన లక్షణమే.

పర్యవసాన మేమిటంటే, మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానం, అవతవకలూ, వ్యత్యాసాలూ, డాబులూ, దర్పాలు ఎదటివాడిలో ప్రదర్శితమయితే మనకు నవ్వేనా వస్తుంది; కోపమేనా వస్తుంది. ఎందుకు -నవ్వు అనేదానికి ఒక్క సమాధానంచెప్పి ముగిస్తాను. ఏ మనిషి తన తప్పు తా నెరుగడు సరికదా; ఎదటివారికా తప్పు ఆరోపిస్తాడు కూడాను. 'మనం చెయ్యని తప్పు ఎదటివాడు చేశాడు. వాడొట్టి మూర్ఖుడు. నేనే అయితేనా' అని తన వీపు తను