పుట:Baarishhtaru paarvatiisham.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధ్యమైనంత వరకూ అనుకరిస్తాం కదా. అటువంటప్పుడు ఈ పార్వతీశం కచిక, తాటాకులు, బొంత, ఎర్ర శాలువ, గులాబి రంగు సిల్కు కండువా, బంతి పువ్వు రంగు పెట్టె వగైరా సామగ్రితో బయలు దేరు తున్నాడంటే, ఇంత వెర్రి ముండాకొడుకేమిటా అని అందరూ నవ్వుకున్నా రనుకుంటాను.

అలాగే ఆడవాళ్ళ టోపీ కొన్నప్పుడూ భోజనాలదగ్గర కత్తికటారు లుపయోగించడం చేతకానప్పుడూ, ఫ్రాన్సులో షాపులో తివాసీమీద నడవ కూడదేమోననుకుని మైనం నునుపు పెట్టిన చక్కలమీద నడవపోయి పడినప్పుడూ ఇంత చేతకానితనం ఉంటుందా అని నవ్వుకున్నారు.

యదార్థం చేత నవ్వవలసిన పనిలేదు. ఏమంటారా, ఈ నవ్వే వారందరూ ఆ పరిస్థితుల్లో, ఆ సన్నివేశాల్లో, ఆ సందర్భాలలో సరిగ్గా పార్వతీశంలాగనో, అంతకంటే కొంచెం తెలివి తక్కువగానో ప్రవర్తించే వారని ధైర్యంగా చెప్పగలను. ఒక పెద్దమనిషి బి.ఎల్. చదవడానికి మద్రాసు వచ్చినప్పుడు క్షౌరశాలలో పార్వతీశానికి కలిగిన సందేహమే తనకూ కలిగిందని రహస్యంగా చెప్పాడు. ఇంగ్లండు వెళ్ళి డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడయివచ్చిన పెద్దమనిషి, తనూ ఒక షాపులో తివాసిమీద నడవకూదనుకొని, తలకిం