పుట:Baarishhtaru paarvatiisham.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలా పెద్ద ప్రశ్న. సమాధానం సరిగా చెప్ప తలుస్తే సవాలక్ష గ్రంథం అవుతుంది. అందుకని సూక్ష్మంగా మనవి చేస్తాను. మనుష్యుల రూపురేఖా విలాసాల్లోనూ, వేషభాషల్లోనూ, మన కంటికి చెవికీ అలవాటైన వానికంటె హెచ్చు తగ్గు లేమాత్రం ఉన్నా మనకు నవ్వు వస్తుంది. ఎదటివాడు ఎక్కువ ఎత్తరి అయినా, కురచ అయినా, లావైనా, సన్ననైనా, పెద్దముక్కున్నా, అసలు లేకపోయినా, కండ్లు ఎగుడు దిగుడుగా ఉన్నా, మెల్ల ఉన్నా, ఇటువంటి తేడాలు ఏమి కనుపించినా నవ్వుతాం. అంటే మామూలు ప్రమాణాల కంటె హెచ్చు తగ్గు లేమున్నా మనకువికారంగా తోచి నవ్వుతాం. ఇదిగాక ప్రతి మనిషిలోనూ కొంత కదలిక, చురుకు, వివేకం, వగైరా లక్షణాలు విడిగా ఉంటా యనుకుంటాను. అని ఏ మనిషిలో నైనా లోపిస్తే ఆ మనిషి అనాగరికుడుగా మనకు కనపడి మనం నవ్వుతాం. అందుచేత కథారచనలో నాయకుడి మాటల్లోనూ, చేష్టల్లోనూ, వేషంలోను ఇటువంటివ్యత్యాసాలు చూపించగలిగితే పాఠకులు నవ్వుకుంటారని తేలింది. మనకంటే ఆంగ్లేయులు చాలా విషయాల్లో నాగరికులనీ, వారి వేషభాషలు చాలా అందంగానూ, నాజూకుగానూ ఉంటాయనీ అందరూ అనుకుంటారు కదా. ఆ పద్దతులూ, ఆ వేషమూ మనం