పుట:Baarishhtaru paarvatiisham.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భారతి పత్రికా సంపాదకులు యీ పుస్తకాన్ని సమీక్షచేస్తూ, ఇది చాలా సిల్లీగా ఉన్నదనీ, ఇంత అనాగరికులు ఈ కాలంలో ఎవ్వరూ ఉండరనీ, అందుచేత ఇటువంటి అభూతకల్పనలతో రచన సాగించి లోకాన్ని ఆనందింప చేయబోవడం తెలివి తక్కువనీ అన్నారు. ఇది 1925 లో! 1957 లో కూడా ఇంకా అంతకంటే అనాగరికులు ఉన్నారంటే నమ్మాలి మీరు. ధర్మ సాధని పక్షపత్రికా సంపాదకులు, వారిని నేను కోరక పోయినా పుస్తకం కొని సమీక్షించారు. ఈ పుస్తకం ఏమీ బాగాలేదనీ, హాస్య మనేది సుతరామూ లేదనీ, పెద్దనవ్వు రాలేదు సరికదా, చిరునవ్వేనా ఎక్కడా మాట వరసకేనా రాలేదనీ వ్రాసారు. నేనేం చెయ్యను. అందరనూ నవ్విస్తానని ఒట్టు పెట్టుకుని నేను పుస్తకం వ్రాయలేదు. ఆయనకు నవ్వు రాలేదంటే అయ్యో పాపం అనుకొన్నాను. ఇటువంటి వారికి ఒక ఆంగ్ల రచయిత వ్రాసిన సమాధానం బాగున్నదనుకున్నాను. దాని సారాంశ మేమిటంటే: ఎవరేనా నాకు నవ్వు ఎప్పుడూ రాదు అంటే, అతని శరీరతత్వంలో ఏదో జబ్బు ఉన్నదన్నమాట. లేదూ, నేను నవ్వనేమైనా సరేనని ఎవరైనా అంటే అతనికి కొంచెం దూరంలో ఉండడం మంచిదన్నాడు. ఒక వ్యక్తి కాని, సంఘం కాని మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక పరి