పుట:Baarishhtaru paarvatiisham.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిచ్చాడు. ఆయన ధర్మమా అని వారం రోజులలో పూర్తి చేశాను. మిత్రులు విన్నారు. బాగుందన్నారు. బారిష్టరు పార్వతీశం అంటే బాగుంటుందని మా సభాపతి శివశంకరశాస్త్రిగారు నామకరణం చేశారు.

ఇది 1924 డిశంబరు మొదటి వారంలో. వెంటనే పుస్తకం బెజవాడలో అచ్చు కిచ్చాను. ఆ నెల 24 వ తేదీని తెనాలిలో సాహితీ సమితి ప్రధమ సమావేశం జరిగింది. నవ్యాంధ్ర సాహిత్య చరిత్రలో అది చాలా ముఖ్యదినం. ఆ సమావేశం బహిరంగ సభలో అనేక మంది సరసుల, సహృదయుల, సాహితీ వేత్తల సమక్షమందు పార్వతీశం తన స్వీయచరిత్ర చెప్పుకున్నాడు. సభికుల ఆనందం వర్ణనాతీతం. అందరూ ఏకగ్రీవంగా అద్భుతంగా ఉన్నదన్నారు. అనగా పార్వతీశానికి నెల పురుడైనా వెళ్ళకుండా బట్టకట్టి బయటపడి అల్లారు ముద్దుగా తయారయ్యాడు. నాటి సభ్యుల హర్షామోదాలు అక్షయ మయినాయి. నాటినుంచీ నేటివరకూ ఇది చాలా బాగుందన్న వాళ్ళే కాని బాగాలేదన్నవాళ్ళు లేరు-పొరపాటు క్షమించాలి... ఒకరిద్దరికి భేదాభిప్రాయం ఉన్నది; లేకపోలేదు. అందులో వింత ఏమీలేదు. ఈ సృష్టిలో సాధారణంగా దేన్ని గురించీ లేని ఏకాభిప్రాయం పార్వతీశాన్ని గురించి మాత్రం ఎందుకుంటుంది! అప్పటి