పుట:Baarishhtaru paarvatiisham.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంచి, నేను గుమ్మలూరు నుంచి గుంటూరుకు ప్రయాణం కట్టాను. అక్కడ మా మిత్రులను కొందరిని-తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి, వఝ్ఝ బాబూరావు, శ్రీనివాస శిరోమణి ప్రభృతులను కూచోపెట్టి, బాలకవులు తరుముకూతపట్టి, తమ పద్యాలు వినిపించినట్లు నా కథ వినిపించాను. వారి ఆనందానికి మేరలేదు. ఇది చాలా పాప్యులర్ అవుతుందని వారు ఆశీర్వదించారు. ఇది యునీక్ వర్క్ అఫుతుందనీ, బ్రహ్మాండమైన జనదరణ పొందుతుందనీ నోరి నరసింహశాస్త్రిగారు అన్నారు. తక్కిన మిత్రులంతా అనేక రకాలుగా నన్ను స్తోత్రం చేశారు. నేను ఊరికే సమయస్ఫూర్తిగా మాట్లాడే వాడినా, హ్యూమరిష్టునా, అని సందేహిస్తున్న మిత్రులు ఒక రిద్దరు, నేను హ్యూమరిస్టునే అని నిర్ధారణ చేశారు. నీ కర్మమింతే? నువ్విలా హ్యూమరస్ స్టోరీస్ వ్రాసుకుని కాలక్షేపం చేసుకోవలసిందే నని నాలు గక్షింతలు నా మీద చల్లారు. ఏది ఎలా ఉన్నా ఈ కథ, ఇక్కడ కూర్చుని పూర్తి చేయవలసిందే నన్నారు సభాపతిగారు. ఎలాగు-నేను తొందరగా వ్రాయలేన్నాను. అందుకనీ కథ అడ్డుతుందా స్వామీ, తమరు తోచినప్పుడల్లా డిక్టేట్ చెయ్యండి. ఈ లేఖ కాధముడు వ్రాస్తాడు... అని శ్రీనివాసశిరోమణి అభయ