పుట:Baarishhtaru paarvatiisham.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుమాస్తాతోటి ఏదో చెప్పాడు. ఆ గుమాస్తా ఒక పెద్ద చిఠా తీసి అందులో నన్ను సంతకము చెయ్యమన్నాడు. మా దొర నన్నొక బంట్రోతుకు ఒప్పజెప్పి, వాడు నాగదికి తీసుకు వెడతాడని చెప్పి నన్ను భోంచేసిన తరువాత వాళ్ళ ఆఫీసుకు రమ్మని చక్కాపోయినాడు.

బంట్రోతు నా సామాను తీసుకువెళ్ళి అక్కడొక చిన్న గదిలో పెట్టాడు. ఆ గదిముందు ఇనప కటకటాల తలుపులు మడవడానికి వీలుగావుండేవి వున్నాయి. గది బొత్తిగా చిన్నదిగా వున్నది. అందులో ఒక చిన్న బల్ల వున్నది. ఇంత చిన్నగదిలో వుండడ మేలాగు అనుకున్నాను. మంచము వేసుకోడానికి స్థలములేదు సరిగదా, బల్లమీద పడుకుందా మనుకున్నా పొడుగు సరిపోయేటట్టు లేదు. గదిలోమట్టుకు దీపము వెలిగించారు. గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనపడదు. ఇంత పెద్ద హోటలులో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను. అన్నీ ఇలాగేవుంటే తక్కిన వాళ్లంతా ఎలా వుంటారా అనిపించింది. ఒకవేళ నన్ను చూచి లోకువకట్టి ఇంకొకళ్లకు పనికిరానిగది నాకు ఇచ్చాడేమో ననుకున్నాను. నాతక్కువమట్టు కేమిటి? ఈ గదిలోకి వెళ్ళకూడ దనుకున్నాను. సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. నేను రాను అన్నాను. రమ్మని ఊరికే సంజ్ఞ చేయడము మొదలు పెట్టాడు. వాడి భాష నాకేమీ తెలియడములేదు. ఏమయినా సరే నేనురాను అని గట్టిగా చెప్పాను. వాడికేమో అర్ధముకాక వెర్రిమొహము వేసుకుని నా కేసి చూశాడు. దీని సంగతేమిటో కనుక్కుందామని గుమాస్తాను పిలిచాను. గుమాస్తాకూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకక్కరలేదు. ఇంకొక హోటలుకు వెళు