పుట:Baarishhtaru paarvatiisham.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళి పోతూండగానే ఒక దొర నాదగ్గిరికి వచ్చి ఇంగ్లీషున పలకరించాడు. ప్రాణము లేచి వచ్చింది. దొరైనా కొంచెము మాట్లాడనైనా మాట్లాడవచ్చును గదా అనుకున్నాను.

'కొలంబోనుంచి వస్తున్నారా?' అన్నాడు దొర. 'అవును ' 'మీ సామా నెక్కడుంది?' 'కింద.' 'ఇక్కడ మీరు ఎరిగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?' 'లేరు---మీరెవరు?' 'నేను ధామస్ కుక్ కంపెనీ మనిషిని, మీకేమైనా సహాయము కావలిస్తే చేస్తాను. మీరెక్కడ బస చేయదలచుకున్నారు?'

'నాకేం తెలియదు. నాకీ దేశము కొత్త. మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాణ్ణో తెలియదు. శ్రమ అనుకోక దయచేసి నన్నేదయినా హోటలుకు తీసుకువెళ్ళితే చాలా సంతోషిస్తాను' అన్నాను.

ఒక నిమిషము నన్ను ఎగా దిగా చూసి 'పెద్దహోటలుకు తీసుకువెళ్ళనా? చిన్న హోటలుకు తీసుకు వెళ్లనా?' అన్నాడు.

ఇంగ్లండు వెళుతున్నవాళ్ళము పెద్ద హోటలుకు వెళ్ళకుండా చిన్న హోటలుకు వెళ్ళడమేమి కర్మమనుకుని పెద్ద హోటలుకే తీసుకు వెళ్ళమన్నాను. అతను మళ్లీ ఒకసారి నావంక చూసి పెద్ద హోటలులో చాలా ఎక్కువవుతుంది అన్నాడు, సంకోచిస్తూ. పైకి ఇలా కనపడ్డా నేను చాలా డబ్బుగలవాణ్ని అని వాడు అను