పుట:Baarishhtaru paarvatiisham.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాకు భోజనము సప్లై చేస్తున్న మనిషివచ్చి స్టీమరు సాయంత్రము దాకా ఆగుతుందనీ ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చుననీ చెప్పాడు. వాడు చెప్పడమంటే చెప్పాడు కాని తీరా ఊళ్లోకి వెళ్ళిన తరువాత హఠాత్తుగా స్టీమరు బయలుదేరి వెళ్ళిపోతేనో! అయినా ఈ నాలుగు రోజులనుంచీ నీటిమీద ప్రయాణము చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణములేచి వచ్చినట్టుంది. నాగదిలో ఉన్న చైనా కుర్ర వాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగచేశారు. నాకూ వెళ్ళవలెనని సరదా పుట్టింది. నేనూ సూటు వేసుకొని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగ బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదుగాని సముద్రపు టొడ్డునే ఒక పెద్దషాపూ ఒక హోటలూ వున్నవి. దూరాన్ని నల్లని శరీరమూ ముద్ద పెదవులూ కోతి మొహాలూ గొర్రె బొచ్చులాగ పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసువెంట్రుకలూ కలిగి మొలచుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాలు పుచ్చుకుని తిరుగుతున్న ఒకళ్లిద్దరు మనుష్యులు కనబడ్డారు. వాళ్లను చూసి పూర్వము చదివిన భూగోళ శాస్త్రము స్మృతికి దెచ్చుకుని ఇది ఆఫ్రికాదేశమై ఉంటుందని ఊహించాను. కాస్సేపు అక్కడే ఇటూ అటూ తిరిగి అక్కడున్న హోటలులో భోజనము చేసి మధ్యాహ్నము మూడుగంట లయ్యేసరికి మళ్లీ స్టీమరు మీదకి వచ్చాను. సాయంత్రము ఆరు గంటలకు బయలుదేరింది.

నా పేరు స్టీమరుమీద నున్న వాళ్లెవళ్లూ నోట పట్టలేక పోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనక నన్ను కొలంబో గారు అని పిలవడము మొదలు పెట్టారు. నా తోటి మాట్లాడే వాళ్లె