పుట:Baarishhtaru paarvatiisham.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


6


లా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా బుజముమీద చెయ్యి వేశాడు. నిద్రలోనుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటీ చిన్నతన మన్నట్టుగా నా కేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరా దొరసానీ, నా దుఃఖము గ్రహించినట్టుగా, నాకేసి జాలిగా చూశారు. నా బుజము మీద చెయ్యివేసిన అతను తన తోటి కూడారమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్లాను. రెండంతస్థులు మెట్లుదింపి అడుగున ఒక హాలులోనుంచి ఒక చిన్నగదిలోకి తీసుకువెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇదే నే నుండవలసిన గది కాబోలు ననుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒక దానిమీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచివున్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణీ బూర్లె మూకుడూ అందులోకి కుళాయి వున్నవి. పక్కనే ఒక సబ్బుపెట్టి వున్నది. ఇంకోపక్క రెండు తువాళ్లు వున్నాయి. నా తలాపు దిక్కు నున్న గోడకి గుండ్రని రంధ్రముమూ, దానికో గాజుతలుపూ వున్నది. అదే మాగది కిటికీ. అందులోనుంచి సముద్రము చక్కగా కనపడుతుండేది. పై బల్లలమీది కెక్కడాని కొక చిన్న నిచ్చెన వున్నది. నేను గదిలోకి వచ్చేసరికే పై రెండు బల్లలమీదా ఇద్దరు చైనా కుర్రవాళ్లు కూచుని తమ