పుట:Baarishhtaru paarvatiisham.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జేబు రుమాళ్లు విసురుతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో గదా ఈ దేశము రావడ మనుకున్నాను. వచ్చేదాకా మట్టు కు నమ్మకమేమిటి! పరదేశములోనే కడతేరుతా నేమో నని భయం వేసింది. భూమి కనపడీ కనపడకుండా ఉంది. తల్లీ దయవుంచమని ఒక్కదండము పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటిపిల్లవాడిలాగ రాగా లెడుతూ అక్కడే నిలబడ్డాను.


Baarishhtaru paarvatiisham.pdf