మార్సేల్సు అనే గ్రామానికి ధామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్టుగా టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా తక్షణము పంపించగోరెదను. మీ రలా చేయనియెడల పరదేశములో చాలా యిబ్బంది పడవలసి వస్తుంది.
ఇదంతా తెలివితక్కువనీ ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదనీ మీరనుకోవచ్చును. కాని నేను చాలా దూరాలోచన చేసే వెళుతున్నాను. బారిష్టరీ ప్యాసు అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏవిధమైన ప్రయత్నమూ చేయవద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యే టంతవరకూ ఇంటికి రాను. ఈ రోజునే స్టీమరు ఎక్కుతున్నాను. మీరు వృధాప్రయాస పడవద్దు.
మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకే తెలుసును. కాని యీ విషయములో మట్టుకు తెలుస్తే వెళ్లనివ్వరని యిల్లా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారము చేయగలనని నమ్మకము ఉండడము చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీ రెంత కష్టపడేదీ నాకు తెలుసును అయినప్పటికీ యిలా చేయక తప్పిందికాదు. పరదేశములో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రముమీద ఏమి అపాయము ఉంటుందో అనీ, మ||న|| మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరెదను. మీకందరికీ యింత కష్టము కలుగజేసినందుకు నన్ను క్షమించవలెను. మార్సేల్సులో దిగగానే