26
ఆత్మవిచారము, ఉత్తరభాగము
[1 వ
ప్రచేతసులచరిత్రమునందు వారు చేసిన తపస్సు, కర్మ మొదలగు సకలఫలములనును భగవత్ప్రీతిగా దత్తముచేసిరని చెప్పియున్నది. ఇట్టిత్యాగములవల్ల వైరాగ్యము కరతలామలకముగా సిద్ధించును. సాధారణముగా మనము ఆచరించు శాకవ్రతము, లవణవ్రతము, ఏకాదశ్యుపవాసము మొదలగు వ్రతములన్నియు వైరాగ్యమును పుట్టించుటకే కదా. ఇట్టి వ్రతములవల్ల పుట్టిన వైరాగ్యమును ఉపాసకుడు కాలక్రమమున బలపరుచుకొనవలయును. మందవైరాగ్యము, మధ్యమవైరాగ్యము అను వానిని దాటి తీవ్రవైరాగ్యమును అభ్యసించవలయును.
ప్రదృశ్యతే వస్తుని యత్ర దోషః న తత్ర పుం సోస్తి పునః ప్రవృత్తిః ।
(సర్వవేదాంతసిద్ధాంతసారసంగ్రహము)
ఎపుడైతే ఒక వస్తువునందు దోషమున్న దాని యొకరు తెలిసికొనియెదరో అపుడు ఆ వస్తువును పొందవలెనను ఆశ వారికి కలుగదు. కనుక వస్తువులయందుండు గుణాగుణములను విమర్శించవలయును.
ఇట్టి దృఢతరవైరాగ్యము అభ్యసించవలయు నని యాశగొనినవానికి ఆరుగురు శత్రువులు కలరని శాస్త్రములు చెప్పుచున్నవి. ఆరుగురుశత్రువుల పేళ్లేమియనిన-కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి. ఇవి ఆరుగా కనబడినను ఇవన్నియు మనస్సుయొక్క చేష్టలే. కొంతమట్టుకు మనస్సుమలినమును పోగొట్టుకోనివారికి నివృత్తిమార్గయాత్రయం దభిరుచియే యుండదు. కనుక ఆరుగురు శత్రువులు అను అరిషడ్వర్గమును జయించు నుపాయమును వెదుకవలయును. ఆఱింట మొదటిది కామము. కామము అనగా కోరిక యని