అధ్యా. 1]
సాధనచతుష్టయము
17
దేహములకు దేహి యొకవిధమైన స్వతంత్రాధికారమును బహుకాలముగా నిచ్చియున్నాడు. అందువలన దేహములు తామే దేహియని నమ్మి వాసనాబలమువల్ల యథేచ్ఛగా వ్యవహరించు చుండును. సుబాలోపవిషత్తునందు "అన్నమయో భూతాత్మా ప్రాణమయ ఇంద్రియాత్మా మనోమయ స్సంకల్పాత్మా విజ్ఞానమయః కాలాత్మా ఆనందమయో లయాత్మా" అని చెప్పబడి యున్నది. ఇందువలన పైన చెప్పబడిన స్వతంత్రాధికారము స్థిరపడుచున్నది. దివ్యజ్ఞానసమాజపు గ్రంథములయందు భూతాత్మకు ఫిజికలు ఎలిమెంటలు (Physical Elemental) అనియు, ఇంద్రియాత్మకు డిౙయిరు ఎలిమెంటలు (Desire Elemental). అనియు, సంకల్పాత్మకు మెంటలు ఎలిమెంటలు (Mental Elemental) అనియు పేళ్లు. దేహి వేరు, దేహములు వేరు అని దృఢనిశ్చయము గలుగుట నిత్యానిత్యవస్తువివేకముయొక్క మొదటి మెట్టు. ఇట్టి జ్ఞానము కలిగితేనే కామక్రోధాదిబంధములు వదులుటకు సాధ్యమైన విచారము కలుగును.
కామము, క్రోధము, లోభము అను మూడును అరిషడ్వర్గములో చేరినవి. అరిషడ్వర్గమనగా ఆరుగురు శత్రువులు అని అర్థము. శ్రీ భగవద్గీతయందు ముఖ్యోపదేశము కామక్రోధలోభములను త్యజించవలసినది అనునదే. శత్రువులను జయించవలె నను ఆసగొన్నవాడు శత్రువులయొక్క బలాబలములను ఆమూలాగ్రముగా విచారించి రహస్యమును తెలిసికొనవలయును. కామక్రోధలోభములు నరకమునకు ద్వారములనియు వాటిని తొలగతోలినవాడు పురుషార్థసాధనమును చేసికొనుచున్నాడు