Jump to content

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

E ఆత్మవిచారము, ఉత్తరభాగము [౧ వ

సః ” అను నుపనిషద్వాక్యప్రకారము స్వస్వరూపానుసంధానము చేయు మహానుభావుడును సుఖయే. ఇటు మూఢుడుగాకయు అటు ముక్తుడుగాకయునుండు మనవంటివారలకు సుఖము లేదని తా త్పర్యము.

పైన చెప్పిన అగస్త్యులవారి వాక్యము అయిన “ వేదాం తార్థవిచారము ” అనుటకు ప్రయోజన మేమనగా:

వేదాంతార్గవిచారేణ జాయతే జ్ఞాన ముత్తమం | తేనా త్యంతిక సంసారదుఃఖ నాశో భవ త్యను ॥ (వివేక చూడామణి)

వేదములయొక్క అంతములు ఉపనిషత్తులు. ఉపనిషత్తులయందు జీవాత్మ ఇట్టివాడనియు పరమాత్మ ఇట్టివారనియు చెప్పబడి యున్నది. వేదాంత + అర్థము=వేదాంతార్థము అనగా జీవాత్మ పరమాత్మలయొక్క స్వభావములు, సంబంధములు ఇవి 'మొదలుగా గల పారమార్థిక విషయములను గురించి చెప్పియున్న చదువు. వేదాం తార్థ విచారము అనగా పై వివరములను శ్రవణముచేసి మననముజేసి అర్థమును అవగాహన చేసికొనుట. మననము అనగా గురుమూలముగా వినినవిషయములను శాస్త్రములయందు చెప్పిన యుక్తులతో సమన్వయముచేసికొని మనస్సునందు ఆ విషయమును స్థిరపరిచికొనుట. . ఇట్లు శ్రవణ మననములు చేసినవాడు అభ్యాసము చేయవలెనని యిచ్ఛయించును. అభ్యాసము చేయవలయును అను ఇచ్ఛకు నిదిధ్యాస యని పేరు. ఇట్టి నిదిధ్యాసవలన జ్ఞానము జనించును. అందువలన దుఃఖనాశమగును అని పై శ్లోకముయొక్క అర్థము. వేదాంతార్థ విచారమునకు బ్రహ్మజిజ్ఞాస యని పేరు.