Jump to content

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యా.] సాధన చతుష్టయము 3

నుటకు ఇంద్రియములకు గాని మనస్సునకు గాని శక్తి చాలదు. కనుక తాము ఎంతమాత్రము అవగాహన చేసికొనినవో ఆ మాత్రము అభిప్రాయమును జీవాత్మకు అందించును. ఈ అభి ప్రాయములు అంతరింద్రియమైన మనస్సునందు మనోభావ ములుగా నిలిచియుండును. మనస్సునందు ఇమిడియుండు మనో భావములను బుద్ధి గ్రహించి జీవాత్మకు సమర్పించుచు జన్మ జన్మాంతరములయందును ఈ చర్యను మరల మరల చేయుచు బహిఃప్రపంచమునుగురించి జీవాత్మకు ఒక విధమైన పట్టుదలను కలుగ చేయుచుండును. అ నేక జన్మములవరకును కామమున కును మనస్సునకును ఉద్దేశము తుల్యముగా నుండును. కామమే మనస్సు అనునట్టుగా నడవడికలో కనపడును. మనస్సునకు కామముయొక్క చర్యలు చాల ఇంపుగానుండును. అంతేకాక మనస్సు కామముయొక్క ప్రేరణకు లోబడి నడుచుచుండును. ఇదంతయు ప్రవృత్తిమార్గయాత్ర.

ఈ యాత్రనే అగస్త్యమహర్షిగారు ప్రవృత్తిమార్గనిరతా అవి ద్యావశవర్తినః " అని వర్ణించిరి.

ప్రవృత్తిమార్గయాత్ర చేసి " యే తు సంస్పర్శజా భో గాః దుఃఖయోనయ ఏవ తే" అని జీవాత్మ తెలిసికొనును. అనగా బహిఃప్రపంచమునందలి విషయస్పర్శవల్ల కలుగు భోగ ములు ఖండితముగా దుఃఖ కారణములే అని తెలిసికొని విర క్తిని కొంతమట్టుకు పొందును. ప్రవృత్తిమార్గమునందు ఇం ద్రియములు, మనస్సు అను తత్త్వములు జీవాత్మకు ఎల్లపుడును తాను వేరు, లోకులు, లోకము వేరు అనియే తెలుపుచు వచ్చెను. అనేక జన్మములకుపిమ్మట నానాత్వము అను వృథగ్భా