Jump to content

పుట:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములనుండి ప్రమాణములతోడ వ్రాయబడి యున్నది. జ్ఞానదీక్షలు (Initiations) పూర్వ గ్రంథములయందు అతి గూఢముగను, పరమరహస్యములుగను సూచింపబడియున్నవి. అట్టి రహస్యోప దేశములు కలవను వా వార్త అచ్చటచ్చట కొందఱయందు సంప్ర దాయముగ నుండినను, అట్టి యువ దేష్టలు, జీవన్ముక్తులు, ఇప్పుడు కలరా యనియు, ఉండినను ఉందురు గాక, వారికిని లోకమున కును ఏలాటి సంబంధమును కల్పించుట యజ్ఞానమనియును, అట్టి మహాత్ములయందు నమ్మిక హిందూ శాస్త్ర సమ్మతము కాదనియు ప్రస్తుతము హిందువులలో పలు పలు అభిప్రాయములు వ్యాపించి, శ్రద్ధాళువులగు భక్తులను సైతము అపమార్గముల ద్రిప్పుచున్నయవి. అట్టి సంశయములను పూర్ణముగ తొలగించుటకు, రెండవ అధ్యాయమునందు—జ్ఞానదీక్షలు, మహీపీఠము అనునవి చాలి యున్నవి. ఈ జ్ఞానదీక్షలను గురించి ఇంకయు వ్రాయదగిన యంశములు బాహుళ్యముగ నున్నయవి. గ్రంథవిస్తర భీతిచే గ్రంథకర్తగారు విరమించిరని తలచెద .

పైయంశములు నివృత్తిమార్గనిరతులకు గాని లౌకిక వృత్తుల యం దెంతమాత్రము సంబంధమున్నను, వారి కివి యచింత్యము లేమో యను సంశయము ఎల్లయెడల కలదు. అట్టి అభిప్రాయము పొరపాటు. జనకుడు లోనగు రాజర్షులు బోధించిన “ తృతీయ మార్గము" నవలంబించుచు, అంతరంగవృత్తులను శుద్ధము చేసికొని ఉత్తమోత్తమగతిం బొందుట సాధ్యము అను ఆదేశమును అను ష్ఠించుటకు తగిన ఉపాయములును, అట్లు సాధించిన పదవియందు ఉత్తీర్ణులైన వారు పర్యవసానమున లోకమున నెట్లు వర్తింతు రను