పీఠిక
ఆత్మవిచారము, పూర్వభాగమునందు వ్రాసిన పీఠికయంత యు నుత్తరభాగమునకు కూడ అన్వయించును.
ఈ గ్రంథముయొక్క ప్రూపులను పరిశీలించిన నా స్నేహి తులు బ్రహ్మశ్రీ అల్లాడి మహాదేవశాస్త్రులవారికి నా కృతజ్ఞతా పూర్వక నమస్కారములను సమర్పించుచున్నాను. ఈ గ్రంథమును అచ్చువేసిన వసంతా ప్రెస్సునందుండు వారిపైకి ఈ గ్రంథముఫార ములను పరిష్కరించిన నా స్నేహితులు చిట్టమూరు సుబ్బరా యడు పంతులుగారికిని నా కృతజ్ఞతను విన్నవించుకొనుచున్నాను.
కాళిదాసు, దండి, నన్నయు, తిక్కన మొదలగు గ్రంథ కర్తలు అను సూర్యుల ప్రకాశమును అనుసరించి ప్రాచీనాధునిక గ్రంథకర్తలు వ్రాసిరి. వారికి పాండిత్యము ఉండినందున వారి గ్రంథములు శోభిల్లుచున్నవి. ఈ గ్రంథకర్తకూడ గ్రంథమును వ్రాసినాడు కాని పాండిత్యము ఉండలేదు. అయితే తాను చదివి విని అవగాహన చేసికొన్న విషయములను తనవంటి యితరులకు ఇయ్యవలెనను నాసతోనే ఈ గ్రంథమును ఈ గ్రంథకర్త వ్రాసి నాడు. బంగారును తూచుటకుగా త్రాసుయొక్క నొక గిన్నెలో బం గారు, దానియెదుటి గిన్నెలో గురిగింజలను ఉంచినంతమాత్రమున నే గురిగింజ బంగారుతో సమానము కాచాలదు. ఆ విధముగా