పుట:Atibalya vivaham.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బహుదంపతుల యవస్థను చూడుడు. ఒక్కమనదేశమునందు తప్ప సమస్తదేశములయందును పురుషులు తాము స్వతంత్రముగా భార్యా పుత్రులనుపోషింప శక్తివచ్చిన తరువాతనే వివాహము చేసికొందురు. మనదేశమునందట్టుగాక తల్లిదండ్రులుపసిబిడ్డలకే వారయనుమతివిచారింపక భార్యల నంటకట్టుటచేత మనబాలురు కౌమార దశయందలి స్వతంత్రవర్తనమును సంతోషమును చవిచూడనివారయి సదా నిరుత్సాహులగుచున్నారు. కాఁబట్టియేయొకహోణపండితుఁ డొకపాఠశాలయం దుపన్యసించుచు అన్ని దేశముల వారికిని కౌమారదశ యుండఁగా మనపెద్దలు మన బాలుర కొకదశ నపహరించి జనసామాన్యమునకు భగవంతుఁ డనుగ్రహించియున్న యత్యంతప్రయోజనకర మయిన కౌమారదశానిక్షేపము తక్కువ చేసి యున్నారని వచించియున్నాఁడు. అందుకుసందేహము లేదు. ఈకౌమారదశయందే పురుషులు తమప్రవర్తనమును స్థిరపరుచుకొని, సుగుణసంపదను గడించి, విద్యాబుద్ధులయందు ప్రబలి ధైర్యసాహసాదులను నేర్చుకొని, స్వతంత్రవృత్తి నలవరుచుకొని, తరువాతి లౌకిక యాత్ర కనుకూలమయిన సాధనసామగ్రినెల్లను సంపాదించుకోవలసినది. దు:ఖముల నెఱుఁగక నిర్విచారముగా నుండవలసిన యటువంటి సుఖకాలములోనే యాఁబోతునకుగుదెకఱ్ఱ కట్టినట్టు మనవారు బాలురకు సంసారము నంటకట్టి తల యెత్తుకొనకుండఁ జేయుటవలన మనవారుత్సాహమును ధైర్యసాహసాదులను లేనివారయి పూనికతో స్వతంత్రించి యేసత్కారమును జేయుటకును పనికిమాలినవా రగుచున్నారు. అందుచేతనే మనబాలురు సాధారణముగా వివాహము లేక పాఠశాలలో చదువుకొన్నంనతవఱకును దేశోపకారము నిమిత్తము పాటుపడవలెననియు, సంఘదురాచారమును మాన్పవలెననియుఁ స్త్రీలయొక్కయు నీచకులమువారియొక్కయు స్థితిని బాగుచేయవలెననియు, తలఁచి మిక్కిలి యుత్సా