పుట:Atibalya vivaham.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49

అతిబాల్యవివాహము

మరణపర్యంతమును గృహముననే యుంచవలసినది కాని గుణహీనునకెన్నడును నియ్యఁగూడదని మనువును "దద్యాద్గుణవతే కన్యాంనగ్నికాం బ్రహ్మచరిణే ! అనినా గుజ్ణహీనాయా నోపరుంధ్యా ద్రజ స్వలామ్" అని కన్యను గుణవంతుడయిన బ్రహ్మచారి కియ్యవలసినదేకాని రజస్వలనైనను గుణహీనుని కియ్యకూడేదని బోధాయనులును, మఱికొందఱు ఋషులును చెప్పి యున్నారు. ఇట్టు చెప్పినను రజస్వలయైన కన్యను వివాహములేక చిరకాల మింట నుంచిన పక్షమున చోరరతియు దానిఫలములైన భ్రూణహత్యాదు లును సంభవింపవచ్చునని యెంచి కొందఱు ఋషులు రజస్వలయైన దానిని శీఘ్రముగా వివాహము చెయ్యనిపక్షమున పాపము వచ్చునని చెప్పియున్నారు. "శ్లో|| ప్రాప్తే ద్వాదశమే వర్షే య: కన్యాం నప్రయచ్చతి! మాసిమాసి రజస్వా: పితా పిబతి శోణితమ్" పండ్రెండవ సంవత్సరము వచ్చినతరువాత తండ్రి కన్యకు వివాహము చేయని పక్షమున, ప్రతిమాసమునందు నాచిన్నదాని ఋతురక్తమును పాపము చేసినట్లని యమస్మృతియందును, ఇత్యాదివచనములు కొన్ని మఱి కొన్ని చిల్లరిస్మృతులయందును గానబడుచున్నవి. మన్ వాదులు ధర్మ శార్యమునిత్తమయి కొన్ని సమయములయందు మాత్రము కొంచెము బాల్యవివాహముల కనుజ్ఞ యిచ్చి యున్నారు. "శ్లో||త్రిశద్వర్షోద్వహేత్కన్యాం హృద్యాం ద్వాదశివార్షికీమ్| ద్వ్యష్టవర్షోష్తవర్షోవా ధర్మే సీదతి సత్వరే||" ధర్మమునకు గావలసినప్పుడు ముప్పదిసంవత్సరములవాడు ఎనిమెదేండ్లదానిని వివాహ మాడవచ్చునని మనువు వ్రాసి యున్నాడు. ఇట్టిస్థలములలోతప్ప సాధారణముగా బాల్యవివాహ ములు చేయకూడదు. బాల్యవివాహములు పూర్వకాలమునందు లేవుగనుకనె యత్రిస్మృతియందు "శ్లో|| వివాహే వితతే యజ్ఞ