పుట:Atibalya vivaham.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము

39

వ్యయము చేయవలసి వచ్చుటచేతను మనదేశములో బహుకుటుంబములు పేదఱికముపాలయి సిమ్మట ఋణములపాలయి చిరకష్ణముల పాలు కావలసిన వగుచున్నవి.కొన్నిచోట్ల వివాహములనిమిత్తము చేసినయప్పులచేత పురుషులు తమకంతకు మునుపు జీవనాధారములుగా నున్న మాన్యములను పోఁగొట్టుకొన్నవారయి భార్య లింటికి కాపురమునకు వచ్చునప్పటికి తిండికి లేక తిరిపె మెత్తుకోవలసినస్థితిని పొందు చున్నారు.మఱికొన్ని చోట్లవారి వివాహములనిమిత్తమయి చేసిన ఋణములను వారి ముమ్మనుమలును వారి సంతతివారునుకూడ తీర్చుకోవలసినవా రగుచున్నారు. పనికిమాలిన బాల్యవివాహములకయి వారి దుర్వ్యయము చేయుటకంటె,ఆధనములో కొంతభాగము పెట్టి బాలురకు విద్య చెప్పించినపక్షమున వా రెంతసుఖపడుదురు? మన వారు బహ్వనర్థములకు మూలమయినయీబాల్యవివాహమును మానిపించి యేల తమబిడ్డల సుఖాభివృద్ధి చేయ బ్రయత్నింపరాదు? ముసలివాండ్ర వేడుకకొఱకు కడుపున పుట్టినబిడ్డలను పాడుచేయుట మానుష ధర్మమగునా? తమ కంతవేడుక చూడవలెనన్న మనసున్నపక్షమున బొమ్మలపెండ్లిండ్లు చేయించి సుఖ మనుభవింపరాదా? అంతటితో తృప్తి కలుగక పోయినయెడల నిజముగా బిడ్డలనే పల్లకులలోపెట్టి యూరేగించి సంతోషమనుభవింపరాదా? "ఎలుకకు ప్రాణసంకటము పిల్లికి చెల్లాటము" నన్నట్లు ముసలివాండ్రయెుక్కయు మూర్ఖుల యెుక్కయు వినోదముకొఱకు పసిబాలికల యెుక్కయు బాలురయెుక్కయు సుఖము చెడఁగొట్టుట క్రూరకృత్యము కాదా? తల్లి యెుక్క యగవుతపులనిమిత్తమును వేడుకలనిమిత్తమును బిడ్డలకు వివాహము చేయుటయయు,వానివలన కలిగెడుకీడుల నా బిడ్డ లనుభవింపవలె ననుటయు నెంత కానిపని?

ఈ బాల్యవివాహములు మనదేశములో చిరకాలమునుండియు