పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహస్రం శిల

169

చేత నే పొందఁదగినది కాదు. (7) క్షుద్రుడై నను ఉత్సాహవంతుఁ డై
నచో గొప్పస్వర్గమును పొందఁగలడు. [8]బీదవారునుగొప్ప వారునుకూడ
నుత్సాహవంతులగుదురనియు, నాప్రాంతవాసులుసు దానిని తెలిసి
కొందురనియు, ఈయుత్సాహము చిరస్థాయిగ నుండననియు నీధర్మ
శ్రావణము చేయబడినది. [9] ఈ అర్థమును నేను వర్ధిల్లచేసెదను; ఎక్కు
వగా వర్ధిల్లఁ జేసెదను. ఇప్పటికంటే ఒకటిన్నర రెట్లయినను వర్ధిల్ల,
జే సెదను. [10] సమయము దొరకినప్పుడెల్ల నీయర్థమును శిలలపై
చెక్కింపుడు. [11] శిలా స్తంభములున్న చోట్ల నెల్ల శిలా స్తంభముల పై
దీనిని చెక్కింపవలెను. [12] ఈధర్మ శ్రావణము ప్రకారము ఈ అధికార
ముగల రాష్ట్రమందంతటను నొకనిని పంప వలెను. [18] ఈధర్మ శ్రా
వణము నేను ప్రయాణములోనుండఁగా చేయఁబడినది. [14] ఈప్రియా
ణమునందు 256 రాత్రులను గడపితిని.

సాహస్రం శిల

సాహస్రమను పట్టణము దక్షిణ బీహారులోని షహాబాదు జిల్లా
లోని యొక తాలూకాకు ముఖ్య పట్టణము గానున్నది. ఇచ్చటి అశోకుని
శాసనము ఒక గుహలో నుండుటచేత ఇంచుకంతయు చెడ లేదు.
1. [1] దేవానాంపియే హేవం ఆ...లి యాని సవఛలాని-అం
ఉపాసకే సుమి! [3] న చు బాఢం వలకం తే
2. [4] సవఛ లే సాధి కే! అం... తే [5]ఏ తేన చ అంత లేన! జంబుదీపసి
అంమిసం దేవా! సంత
3. మునిసా మిసం దేవ కటా! (6) పల... ఇయం ఫలే (7}నో...
యం మహత తా వ చకియే పోవత వే! ఖుద కేన పి పల-

22