పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుమ్మిందై స్తంభము

ఈ స్తంభము నేపాల్ దేశములో భగజాన్ పూర్ నకు రెండు మైళ్ళు త్తరముగను బస్తీ యను బ్రిటిషు జిల్లాలోని దుళ్ళాగ్రామమునకు ఆగ్నేయముగ ౫ మైళ్ళదూకముగను సున్న రుమ్మిం దై దేవాలయము నడు దగ్గరనున్నది. దీని యెత్తు 21 అడుగులు. ఈస్థలమునందు బుద్ధశా క్యముని పుట్టుట చేత అశోక చక్రవర్తి ఈస్థలమునకు వచ్చి ఈ స్తంభ మును నిలిపి లుంబినీ గ్రామము మీది పన్నుల నన్నిటిని తీసి వైచెనని ఈ శాసనము తెలుపుచున్నది. ఈరుమ్మిందై అసుస్థలమే శాననములోని లుంమ్మినీ గ్రామమును, బౌద్ధ గాధలలోని లుంబినీవనమునై యున్నది.

1. (1) దేవానపియేన పియదసిన లాజిన వీనతివసాభిసితేన
2.అతన ఆగాచ మహీయితే హిద బుధే జాతే సక్యమునీ తి
3.(2) సిలా విగడభీ చా కాలాపిత సిలాథభే చ ఉన పాపితే
4.హిద భగవం జాతే తి (౩) లుమ్మినిగామే ఉబలికే కటే
5.అర భాగియే చ

సంస్కృతము

1. దేవానాంప్రియేణ ప్రియదర్శినా రాజ్ఞా వింశతివర్షాభిషిక్తే నా- త్మనాగత్య మహీయితమత్ర బుద్దో జాతః శాశ్యమునితిరి [2] శిలావలభీ చ కారితా శిలాస్తమ్భశ్చోత్థాపితో త్ర భగవా జ్ఞాత ఇతి [౩] లుంబినీ గ్రామ ఉద్వలికః కృతో ష్టభాగే చ.

తెనుఁగు

[1] బుద్ధ శాక్యముని ఇచ్చటజన్మించినందున దేవానాంప్రియప్రి యదర్శి రాజు తన రాజ్యాభిషేకకాలము ఇరువదియవనంవత్సరమున నిచ టికి స్వయముగవచ్చి దీనిని పూజించెను. [2] భగవంతుఁడ గుబుద్ధుఁడిచ్చ