పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సార్నాథస్తంభము.


సార్నాథగ్రామము కాశీకి మూఁడున్నర మైళ్ళ దూరముననున్నది. ఇది మిగదాయమను లేళ్ళవనము నకు దగ్గరగా ఋషి పట్టణమునకు చేరు వగనున్నది. ఈ మిగ దాయమునందే బుద్ధుఁడు తన మొదటి ధర్మోపన్యాస మును చేసెను. ఈ స్తంభము పైభాగమున మిక్కిలి అద్భుతముగా చెక్క- బడిన నాలుగుసింహములు అమర్చ బడియున్నవి. ఈనాలుగుసింహము లమధ్యను పెద్దశిలా చక్రమున్నది. ఇప్పుడాచక్రములోని కొన్ని ఖండ ములుమాత్రము మిగిలియున్నవి. ఇదియేధర్మచక్రము, ఈసింహవిగ్రహ ములు ఒక మద్దెలఆకారముగల రాతి పై నిలువఁబడియున్నవి. మద్దెల పైని ఒక సింహము, ఒక ఏనుఁగు, ఒక ఎద్దు, ఒక గుఱ్ఱము, వీని విగ్రహములు నాలు చక్రముల మధ్య అమర్పఁబడియున్నవి. "ఏ దేశమునందుగాని ఇంత కంటెనిపుణతతోను ఇంతకంటె అందముగను, ఇంతకంటె స్వాభావికము గసు, గంభీరముగను ప్రతివిషయములోను తూచాతప్పకుండ చెక్కబ డిన జంతుశిల్పము కానరాదు" అవి యొక విద్వాంసుఁడగు చిత్ర కారుఁ డువ్రాయుచున్నాఁడు. ఈ మృగవనమునకు అశోక రాజుకట్టిన యొక స్థూపమునకు ముందు 70 అడుగులయెత్తుగల యొక శిలా స్తంభముండెనని హౌనుత్సాంగు అను చీనా యాత్రికుఁడు వ్రాసియున్నాఁడు. కాని ప్రస్తుత స్తంభము 37 అడు గులు మాత్ర మేయున్నది. హౌసుత్సాంగు దీని యెత్తున ఎక్కువగ చెప్పి నాఁడో, ఇది మఱియొక స్తంభమో తెలియదు.

1. (1) దేవా.......
2. ఏల.....
3. పాట......యే కేనపి సంఘే భేత వే (4) ఏ చుంఖో