పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

అశోకుని ధర్మశాసనములు.

సరిం చెదరనియు, నేనీ అనుశాసనమును జేసితిని. (42) జనులు దీనిని
ననుసరించిన యెడల, ఇహమందును పరమందును, సౌఖ్యములనందుదురు.
28) నేను రాజ్యాభిషిక్తుఁడ నైన యిరువది ఏడవసంవత్సరమున నీధర్మ
లిపి నాచే లిఖింపఁబడినది. (44) దీనివిషయమై దేవానాంప్రియుఁడు
చెప్పుచున్నాఁడు. (45) ఈధర్మలిపి చిరస్థాయి యై యుండుటకు శిలా స్తం
భములుగాని, శిలాఫలకములుగాని దొర కెడి చోట్లయం దెల్ల లిఖింపవఁబడ
వలయును.