30 బాగుగానేయని ఇంటిలోనికి వర్షము కురియునట్లు, సుసమాహి తముగానిమనస్సులోనికి కామముప్ర వేశించును.
మోహావిష్ణులై మూర్ఖులు దంభముననుసరింతురు. బుద్ధిమంతుఁ డు శ్రద్ధను పరమధనముగా సంరక్షించుకొనును.
మనస్సునరికట్టుట కష్టము. అది పరుగెత్తుచుండును. తన యిష్ట మువచ్చినచోటికి దౌడువేయుచుండును. దానిని మచ్చిక చేయుట మంచిది. అవియే యానందముకలుగఁ జేయు గు
పువ్వుయొక్క రంగుకుగాని, సుగంధమునకుగాని ఎట్టిఅపాయ మునుకలుగనీయక, మధువుకు గోలి, సాజ్ఞుఁడు భూమి పైవసింపవలయును. తేనెటీగ ఎగిరిపోవునట్లు
చిత్రవర్ణ ములుగలిగియు నిర్గంధమగు చక్కని పూపువలె ఆచార హీనమయిన చక్కనిమాటలనాడుట నిరర్థకమయియుండును చక్కని వరముహ, 53 మంచిసుగఁథమునుగల కోమలపుష్పమువలె తాను పలు కువలుకులహొరికారము ఆచరించుట ఫలవంతమైయుండును.
యుద్దమునందు లక్షలకొలఁదిజనులను జయింపవచ్చును. కాని, తన్ను తాను జయించుకొన్న వాఁడే వీరుఁడు
కోపమునుదయ చేతలు, కీడును మేలు చేతను, లోభినిదానముచే తను, అసత్యవంతుని సత్యముచేతను జయింపవలెను
సత్యమునుపలుకవలెను, కోపమునులోఁబడకూడదు. అడిగిన వారికీ తనకున్న కొంచెములో నండియే ఈయవలెను. 'ఈ మూడింటివల నను దేవతలను సందర్శింపవచ్చును.
పుట్టుక వలనఛండాలుఁడు కానేరఁడు; పుట్టుకవలన బ్రాహ్మణుఁ డును కానేరడు. తాను చేయువనులవల్లనే ఛండాలుఁ డగును. తాను చే యువసులవలననే బ్రాహ్మణుఁ డగును.