పుట:Artharakshamani018205mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. జననీ! క్ష్మాసుత! మంగళంబు; భరతా! శత్రుఘ్నుడా! లక్ష్మణా!
హనుమా! యంగద! జాంబవంత! రవిపుత్రా! నీలుడా! మంగళం;
బనఘస్వాంత! విభీషణా! దనుజరాజా! మంగళం; బార్తులన్‌
మనుపం బుట్టిన శ్రీశ! మంగళము; రామా! యార్తరక్షామణీ. 116

గద్యము.

ఇది శ్రీపరమేశ్వర ప్రసాదసమాసాదిత సరసకవితాదురంధర, పండిత

ప్రకాండపరిషద్బహూకృత, 'కవిశేఖర ' 'సూక్తిసుధానిధి ' బిరు

దాంకిత, వడ్డాది సాధువంశక్షీరనీరాక రాచ్చనామాత్య

పౌత్ర, హరితసగోత్ర, పవిత్రగుణకదంబలక్ష్మాంబా

గర్భశుక్తిముక్తాఫల, సూరపరాజప్రధానతనూ

భవ, విబుధవిధేయ సుబ్బారాయ నామధేయ

ప్రణీత మార్తరక్షామణి

సంపూర్ణము.

రామార్పణము

శ్రీరస్తు.

ఆంగీరస సం. మాఘ బ. ఆదివారము. క్రీ.శ.

1933 ఫిబ్రవరి 19 తేది.