పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 4

కర -- నీ పుణ్యంచేత యిప్పుడే వెళ్ళినాఁడు. నీకు వీధిలో ఎదురుపడలేదుగద? నీవు అదృష్టవంతురాలవు. నీకుయీరాత్రి పందిరి పట్టె మంచమూ పరుపూ దొరకుతుంది. నీవు మన వివాహంమాట మాత్రము యెవరితోనూ చెప్పకుమా.

మోహి -- యెవరితోనూ చెప్పను. వక్క నా స్నేహితులు బుచ్చితోనూ అచ్చితోనూ మంగితోను - (ఆలోచించి) - యింకా యెవరితోచెపుతానా? మా మేనమామ పుల్లిగాడితోకూడా -

కర -- సరి యేడిసినట్టేవున్నది నీరహస్యం. డప్పుపుచ్చుకొని టమటమా వేసి మాదిగవాడితోకూడా చెప్పు. నాయజమానుడితో నాకు పెళ్ళికాలేదని చెపుతూవున్నానుగదా! నాగుట్టు ఆయనకు తెలిస్తే?

మోహి -- ఎవరితోనూ చెప్పవద్దని వాళ్ళచేత చేతిలోచెయ్యి వేయించుకుంటానులే.

కర -- నీ రహస్యం నీవుదాచుకోలేవుగాని యిఖ యితరులు దాస్తారా? యెలాగా నా యజమానుడికి తెలియకమానదు. ఆడదాని వద్ద రహస్యం దాగదని పెద్దలుచెప్పినమాట వూరికేపోతుందీ?

మోహి -- అవును. నావద్ద రహస్యందాగదు. రహస్యం దాగవలెనంటే నీవు నాకు తెలియకుండానే పెళ్ళి చేసుకోలేక పోయినావా?

కర -- సరిసరి యిది మరీచిత్రముగావున్నది. నీకు తెలియకుండానే నిన్ను నేను పెళ్ళిచేసుకోవలసినది కాదూ? ఇటువంటి దేవరహస్యాలు నా యజయానుడికేకాని నాకు తెలియవు.

మోహి -- మనరహస్యం నీ యజమానుడికి తెలిస్తేమాత్రం మనకు వచ్చిన భయం యేమిటి? నన్నుచూచి అతఁడు సంతోషిస్తాడో లేదో వక్కపర్యాయం తీసుకునివెళ్లి చూపు. తాను