పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 2

మాపంతులుగారు యీవాళ స్టీమరుదాటి కొవ్వూరు వెళుతారు. అమ్మగారు పుట్టింటికివెళ్ళినారు. ఈవేళ నేను నాభార్యను యిక్కడకు దీసుకొనివచ్చి అమ్మగారి పడకగదిలో నేనుయీరాత్రిఅంతా ఖులాసాగా వుంటాను; అవతలినుంచి యెవరో వస్తూవున్నట్టున్నారు.

[రామాకాంతము పంతులుగారు ప్రవేశించుచున్నారు.]

రామా -- కరటకా! కరటకా! వాసుదేవరావు పెళ్ళాము స్టీమరుమీదికి వెళ్ళిందా ?

కర -- ఇప్పుడే వెళ్ళింది. మీరు వెంటనే వెళ్లితే స్టీమరు అందుతుంది. మీరు వేగిరం బయలుదేరవలెను. (తనలో) నేను యీరాత్రి యీయనను యెలాగయినా పంపించివెయ్యవలెను.

రామా -- నన్నుకూడా వెళ్ళమన్నావా? మీఅమ్మగారుకూడా వూళ్లోలేరు. ఇల్లునీవు చూస్తూవుంటావా?

కర -- అవశ్యంగా వెళ్ళండి. నేను బ్రహ్మాచారిని. పెళ్లాము వద్దకుపోవలసిన పనిలేదు. నేనీరాత్రి యిక్కడనే పరుండి మీయిల్లూ వస్తువులూ మీకుపదిలంగా వప్పగిస్తాను.

రామా -- ఈలోగా వూరినుంచి మీఅమ్మగారు రాదుగదా? మగవాణ్ని కావడంచేత నేనుదాన్ని వదలిపెట్టివుండగలిగినా, అది పనికిమాలిన ఆడది కావడంచేత పట్టుమని పదిరోజులయినా పుట్టింటి కాడ నన్ను వదలిపెట్టి వుండలేదు. నేనువర్తమానం పంపించకుండానే బండి చేసుకుని దుడుంగున వస్తూవుంటుంది. పుట్టిల్లు దగ్గిరవూరుకావడంచేత యీఅసందర్భం వస్తూవుంటుంది.

కర -- ఆవిషయంలో మీరేమీ భయపడనక్కరలేదు. అమ్మగారు యీరోజుకురారు. వకవేళవచ్చినా నేను సర్దిచెప్పి మీరు కొవ్వూరు తగాదాలో స్థలంచూడడం నిమిత్తం వెళ్ళినారని చెపుతాను. స్టీమరు మించిపోతుంది. మీరుత్వరగా వెళ్ళవలెను.