పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 27

రామా -- అవును మాఆడవాళ్లు వూళ్లో లేకపోవడంచేత మా బంధువులయింట్లో భోజనంచేసినాను. మీరు యీసంగతి యెక్కడా చెప్పబోకండి. అంతగా కావలిస్తే తద్దినం రేపువుదయాన్న పెడుదాము.

సోమ -- చిత్తము. అలాగేకానిత్తాము. నాకు నాలుగురోజులలో తూర్పు వెళ్ళవలసిన పనివున్నది. వెళ్ళితే నాలుగునెలలదాకా రానండి. ఈలోగా తమలోపలవచ్చే కార్యాలు మరీయేమీలేవు.

శ్యామ -- ఏవయ్యా బ్రాహ్మడా! నీకు వూరికివెళ్ళవలసిన పనివున్నదని యింత కక్కూర్తిపడుతావు? మామామగారుపోయింది వైశాఖమాసమయితే యీచైత్రమాసంలో తద్దినం యెలాగువస్తుందయ్యా?

సోమ -- అమ్మగారూ! కోపంపడకండి. నేనుపంచాంగం పొరపాటుగా చూచినాను కాబోలును. మళ్ళీవెళ్ళి తద్దినాలజాబితా తిన్నగా చూచివస్తాను. (అనిపోఁబోవుచున్నాఁడు.)

కర -- (ఆపి) అయ్యా! మీరుమాయిద్దరికీ పెళ్ళిచేయించిన సంగతి యీయనతో వక్కసారి చెప్పిమరీపొండి.

సోమ -- అవును అందులో యేమితగాదావున్నది? నేనుమంత్రాలు తిన్నగా చెప్పలేదని యెవరయినా ఆక్షేపణ చేసినారా యేమిటి? శూద్రపెళ్ళి పురాణోక్తం గనుక మంత్రాలక్కర లేదు.

రామా -- వీళ్ళకు మీరు పెళ్ళి యెప్పుడుచేయించినారు?

సోమ -- రెండుసంవత్సరాలకిందట చేయించినాను.

రామా -- కరటకా! నీవు రెండుసంవత్సరాలనుండి గృహస్థువైవుండిన్నీ నావద్ద బ్రహ్మచారివిగానే నటించినావా?

కర -- నేనువూరికే బ్రహ్మచారిగా నటించడంమత్రమే కాని నిజానికి సంసార సుఖాలన్నీ అనుభవిస్తూనే వున్నాను. లోకంలో